Brahmamudi : భార్యని వాటేసుకొని నిజం చెప్పేసిన భర్త.. సూపర్ ట్విస్ట్!
on Dec 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -598 లో.... కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంది. నేను ఎలాగైనా ఎస్సై అయి తిరిగి వస్తాను. అందుకే ఎంత కష్టమైనా ఉంటున్నానని అప్పు అంటుంది. నువ్వు నన్ను చూడడానికి రావొచ్చు కదా అని అప్పు అనగానే.. త్వరలో వస్తానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని అప్పు అనుకుంటుంది. అయిన నాకు చెప్పకుండా ఉండడులే అనుకుంటుంది అప్పు. ఆ తర్వాత కావ్యని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటాడు రాజ్. ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చి టీ పెట్టుకుంటాడు రాజ్. అప్పుడే అపర్ణ వచ్చి.. ఏంటి ఈ మార్పు అన్నట్లుగా మాట్లాడుతుంది.
ఏ మాయ చేసావ్ కావ్య.. రాజ్ మారిపోతున్నాడని కావ్యతో సరదాగా మాట్లాడుతుంది అపర్ణ. ఆ తర్వాత కావ్య ఫ్యాన్ క్లీన్ చేస్తుంటే రాజ్ వస్తాడు. కావ్య పడిపోతుంటే రాజ్ పట్టుకుంటాడు. నేను హెల్ప్ చేస్తానని తను ఫ్యాన్ క్లీన్ చేస్తుంటే కావ్య మీద పడిపోతాడు రాజ్. ఇద్దరు కాసేపు రొమాంటిక్ గా చూసుకుంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు వాళ్ళని చూసి వెళ్ళిపోతారు. రాజ్ తర్వాత వస్తానంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంటే కావ్య సిగ్గుపడుతుంది. ఆ తర్వాత కొంచెం కూడా సిగ్గు లేదు కనీసం డోర్ కూడా వేసుకోలేదని ధాన్యలక్ష్మి అంటుంది. వాళ్ళు కలిసిపోతే మన మాటకి వాల్యూ ఉండదు. ఇక ఇలా ఉంటే చాలదంటు ధాన్యలక్ష్మిని రెచ్చగోడుతుంది రుద్రాణి. మరొకవైపు సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి.. రాజ్ లో మార్పు వస్తుంది.. నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. మనకి కావల్సింది కూడా అదే కదా అని సుభాష్ అంటాడు.
వాళ్ళ మాటలు కావ్య విని హ్యాపీగా ఫీల్ అవుతు.. తన మనసులో నా పైన ప్రేమ మొదలైందన్న మాట.. చూడాలి ఎలా ప్రపోజ్ చేస్తారోనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి ఆఫీస్ నుండి మేనేజర్ కాల్ చేసి.. రేపు బ్యాంక్ వాళ్ళు ఆఫీస్ కి వస్తున్నారని చెప్తాడు. దాంతో కావ్య కి విషయం చెప్పాలని రాజ్ అనుకొని గదిలోకి వెళ్లి డోర్ వేస్తాడు. నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని రాజ్ అనగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో నేను సమస్యలో ఉన్నానంటూ సీతారామయ్య షూరిటీ గురించి జరిగింది మొత్తం కావ్యకి చెప్తాడు రాజ్. దాంతో కావ్య షాక్ అవుతుంది. రాజ్ బాధపడుతూ కావ్యని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read